Back to FeedQuickToday Shorts

Andhra Pradesh
Aug 10, 2026Short Read
బంగాళాఖాతంలో ఆవర్తనం: రేపు ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు!
వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం బుధవారానికి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) వెల్లడించింది.
దీని ప్రభావంతో రేపు రాష్ట్రంలోని విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, శ్రీసత్యసాయి, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ చెదురుమదురుగా తేలికపాటి వర్షాలు పడతాయని అంచనా వేసింది.





